Rampachodavaram: వెదురు ఉత్పత్తులతో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధి కలెక్టర్

Rampachodavaram: వెదురు ఉత్పత్తుల ద్వారా గిరిజన మహిళల ఆర్థిక వృద్ధికి చర్యలు. ఐటీడీఏ సమావేశంలో యాక్షన్ ప్లాన్ సమర్పించాలని ఆదేశించిన కలెక్టర్ దినేష్ కుమార్.

Prasanna, Rampachodavaram
Published on: 4 July 2026 7:02 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: వెదురు ఉత్పత్తులతో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధి కలెక్టర్

రంపచోడవరం: పోలవరం జిల్లా, రంపచోడవరం లోని మహిళలు వెదురు ఉత్పత్తుల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె. పేర్కొన్నారు. శనివారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాల్లో పిడి డిఆర్డిఏ తో, సబ్ డిఎఫ్ లతో, ఫారెస్ట్ రేంజ్ అధికారులతో, ఐ ఎస్ బి ప్రతినిధులతో వెదురు ఉత్పత్తులు అభివృద్ధి చేసే విధంగా జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకు వెదురు ఉత్పత్తులను అభివృద్ధి చేసీ ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఎక్కడికక్కడ తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలో వన సంరక్షణ సమితులు (విఎస్ఎస్) లు ఎన్ని ఉన్నవి ఎన్ని గ్రామాలలో ఉన్నది ఒక్కొక్క విఎస్ఎస్ కు ప్రతి సంవత్సరం ఎంత ఆదాయం వచ్చుచున్నది వచ్చిన ఆదాయం అడవి శాఖకు, వి ఎస్ ఎస్ లకు ఎంత ఆదాయం వచ్చినది అదేవిధంగా వి ఎస్ ఎస్ లు వచ్చిన ఆదాయం ఏ పనులు చేయుచున్నది ఏ అభివృద్ధి పనులకు ఖర్చు ఆయన ఆరా తీశారు.

అదేవిధంగా అరణ్య శ్రీ అభివృద్ధికి గ్రామ సభలో తప్పనిసరిగా తీర్మానాలు చేయాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్కొక్క సి ఎఫ్ ఆర్ కమిటీకి ప్రభుత్వం ద్వారా 15 లక్షలు రూపాయలు గిరిజన అభివృద్ధికి ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఒక్కొక్క సి ఎఫ్ ఫర్ కమిటీకి వచ్చిన 15 లక్షల రూపాయల ప్రభుత్వం నిబంధన ప్రకారం కేటాయించిన భూములలో ప్రభుత్వ నియమించిన మొక్కలు వేసి అభివృద్ధి చేసిన అనంతరం ఆయా గ్రామాలలో అభివృద్ధి పనులకు ఉపయోగించడం జరుగుతుందని ఆయన అన్నారు.పోలవరం జిల్లాలోని వివిధ గ్రామాలలో వెదురు అభివృద్ధి చేసే విధంగా ఎక్కడికి అక్కడ అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

సి ఎఫ్ ఆర్ యాక్షన్ ప్లాన్లు తయారు చేసీ సమర్పించాలని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలోని గిరిజన మహిళలు వెదురు ఉత్పత్తులు తయారు చేసిన వాటిని మార్కెట్కు పంపే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు.అడవి ఉత్పత్తులు తయారు చేసే విధంగా దేవరపల్లి గ్రామంలో ప్రాసెస్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. వెదురు ఉత్పత్తులు వలన ఆయా గ్రామాలలోని గిరిజన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా డి ఆర్ డి ఏ అధికారులు ప్రోత్సహించాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో సబ్ డి ఎఫ్ లు సుబ్బారెడ్డి, రవీంద్రనాథ్,పి డి డి ఆర్ డి ఎ డాక్టర్ దాసరి రత్నాకర్ రావు,డిపిఎం దుర్గాప్రసాద్,ఫారెస్ట్ రేంజ్ అధికారులు జీవి నానాజీ, ఆజాద్, ఐ ఎస్ బి ప్రతినిధులు హేమంత్, పసంగి, ఆర్ ఓ ఎఫ్ ఆర్ కోఆర్డినేటర్ జి. ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story