Bhimavaram: భీమవరంలో ఘనంగా చిరంజీవి పుట్టినరోజు పేదలకు, దివ్యాంగులకు సహాయం!
Bhimavaram: భీమవరంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. దివ్యాంగులకు దుస్తులు, పండ్ల పంపిణీతో పాటు వీరాభిమాని వైద్య ఖర్చులకు రూ.10,000 ఆర్థిక సాయం.
Bhimavaram: భీమవరంలో ఘనంగా చిరంజీవి పుట్టినరోజు పేదలకు, దివ్యాంగులకు సహాయం!
Bhimavaram: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని భీమవరంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సామాజిక, సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు ఉండపల్లి రమేష్ నాయుడు అధ్యక్షతన ఈ కార్యక్రమాలు ముమ్మరంగా సాగాయి.
ఈ వేడుకల్లో భాగంగా స్థానిక దివ్యాంగులకు నూతన వస్త్రాలు, పండ్లను పంపిణీ చేశారు. అలాగే, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిరంజీవి వీరాభిమాని చెక్కా బాబ్జీ వైద్య ఖర్చుల నిమిత్తం భీమవరం మెగా అభిమానులందరూ కలిసి ₹10,000 ఆర్థిక సాయాన్ని అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ... తన పుట్టినరోజున ఆడంబరాలకు దూరంగా ఉండి సమాజ సేవలో పాల్గొనాలన్న చిరంజీవి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అభిమానులంతా ఎల్లప్పుడూ సేవా దృక్పథంతో ఉండాలని, ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




