Chintoor: చింతూరులో వరద ఉధృతి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటన

Chintoor: చింతూరు ఏజెన్సీలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి, శబరి నదులు. ముంపు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటన, ట్రాక్టర్‌పై గర్భిణి ఆస్పత్రికి తరలింపు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 1 Aug 2026 7:41 PM IST
Chintoor
X

Chintoor: చింతూరులో వరద ఉధృతి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటన

చింతూరు: పోలవరంజిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి, శబరి నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి. వరద బాధితులకు నేనున్నానంటూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు అండగా నిలబడుతున్నారు.

చింతూరు ఏజెన్సీలో వరరామచంద్రపురం, చింతూరు,కూనవరం, ఎటపాక మండలాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలలో కలెక్టర్ పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు వరదల పై అప్రమత్తం చేస్తూ బాధితులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు చర్యలు చేపడుతున్నారు.

ఓ గర్భిణీ స్త్రీ ఇబ్బంది పడుతుంటే కలెక్టర్ దినేష్ కుమార్ స్వయంగా ట్రాక్టర్ పై ఆమెను ఎక్కించుకొని కోతులుగుట్ట లోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చేర్పించడం జరిగింది. ముంపు ప్రాంతాలలో ఎప్పటికప్పుడు బాధితుల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కలెక్టర్ కృషి చేస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు,మంచినీటి సరఫరా అందిస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story