Bhimavaram: భీమవరంలో ఉత్సవాల నిర్వహణకు పోలీసుల మార్గదర్శకాలు!
Bhimavaram: భీమవరంలో విగ్రహాల ఏర్పాటు, పండుగల నిర్వహణపై డీఎస్పీ రఘువీర్ విష్ణు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
Bhimavaram: భీమవరంలో ఉత్సవాల నిర్వహణకు పోలీసుల మార్గదర్శకాలు!
భీమవరం: త్వరలో రానున్న పండుగల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణపై స్థానిక డీఎస్పీ రఘువీర్ విష్ణు పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. ఉత్సవ నిర్వహకులు ఖచ్చితంగా పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ, విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం 'సింగిల్ విండో' విధానంలో పోలీసుల నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు. ఉత్సవాల్లో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజల భద్రతే లక్ష్యంగా పలు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఉత్సవాల్లో డీజే (DJ)ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాం. ఎవరికీ డీజేలకు అనుమతి లేదు. కేవలం చిన్న బాక్స్ మైకులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు .
మైకుల శబ్ద తీవ్రత 30 డెసిబుల్స్ మించకూడదు. ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు మాత్రమే మైకులు ఉపయోగించాలి. రాత్రి 9:00 గంటల తర్వాత మైక్ వాడకంపై పూర్తి నిషేధం అని తెలిపారు. ట్రాఫిక్‌కు మరియు ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించేలా ప్రధాన రోడ్లపై, రద్దీ కూడళ్లలో విగ్రహాలు ఏర్పాటు చేయరాదు. భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా ప్రాపర్ క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు
మండపాల్లో దీపాలు, విద్యుత్ వైరింగ్ మరియు బాణాసంచా కాల్చే విషయంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . ముందస్తుగా ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించాలన్నారు మండపాల వద్ద రాత్రి వేళల్లో ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా కాపలా ఉండాలి.
ఇతర మతాల ప్రార్థనా మందిరాల వద్ద ఎలాంటి సున్నితమైన సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు వహించాలి. ఉత్సవ ప్రాంగణాల్లో భక్తిభావం ఉట్టిపడేలా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాల్సిన భాద్యత ఉండదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, వదంతులను ప్రజలు గుడ్డిగా నమ్మవద్దని కోరారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను (SHO) సంప్రదించాలని డీఎస్పీ సూచించారు.




