Bhimavaram: భీమవరంలో APOSS అడ్మిషన్ల ప్రక్రియపై విస్తృత అవగాహన సదస్సు

Bhimavaram: భీమవరంలో ఏపీఓఎస్ఎస్ అడ్మిషన్లపై హెచ్‌ఎంలతో అవగాహన సదస్సు నిర్వహించారు. కోఆర్డినేటర్ పెన్మెత్స వెంకట సత్యనారాయణ రాజు దిశానిర్దేశం చేశారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 4 Aug 2026 11:42 AM IST
Bhimavaram
X

Bhimavaram: భీమవరంలో APOSS అడ్మిషన్ల ప్రక్రియపై విస్తృత అవగాహన సదస్సు

​గత ఏడాది కంటే ఎక్కువ అడ్మిషన్లు సాధించడమే లక్ష్యం

ఏపీఓఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ పెన్మెత్స వెంకట సత్యనారాయణ రాజు

​భీమవరం (పశ్చిమ గోదావరి జిల్లా ):

ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) 2026-27 విద్యాసంవత్సర అడ్మిషన్ల ప్రక్రియను పురస్కరించుకుని భీమవరం మండల స్థాయిలో ప్రధానోపాధ్యాయులతో ఒక ముఖ్యమైన అవగాహన సదస్సును మంగళవారం ఘనంగా నిర్వహించారు. భీమవరం మండల పరిధిలోని అన్ని జిల్లా పరిషత్ (ZPP) మరియు ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (HMs) ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఓఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ పెన్మెత్స వెంకట సత్యనారాయణ రాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల విధానం, దరఖాస్తు ప్రక్రియ మరియు అర్హతల గురించి హెచ్‌ఎంలకు క్షుణ్ణంగా వివరించారు.

​పాఠశాల విద్యకు దూరమైన వారికి, రకరకాల కారణాలతో చదువు మధ్యలో నిలిపివేసిన వారికి తిరిగి విద్యావకాశాలు కల్పించడంలో ఏపీఓఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రతి ప్రధానోపాధ్యాయుడు ఈ అడ్మిషన్ల ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామ సచివాలయాలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఉపాధ్యాయుల సహకారంతో ఇంటింటికీ సమాచారం చేరేలా సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి గణనీయంగా అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు శ్రమించాలని హెచ్‌ఎంలకు దిశా నిర్దేశం చేశారు.

​ఈ అవగాహన సదస్సులో భీమవరం మండలం ఎంఈఓ-2 కే.సిహెచ్. సాయిరాం పాల్గొని మాట్లాడుతూ — మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి ఓపెన్ స్కూల్ ద్వారా విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

​అదేవిధంగా పి.ఎస్.ఎమ్. (PSM) హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తో పాటు భీమవరం మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల ప్రతినిధులు ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్మిషన్ల నమోదులో ఎదురయ్యే సందేహాలను అధికారు దృష్టికి తీసుకురాగా, జిల్లా కోఆర్డినేటర్ వాటికి తగిన నివారణ మార్గాలను సూచించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story