Bhimavaram: నకిలీ పత్రాలతో ఆస్తి కబ్జా యత్నం - బాధితుడి ఆవేదన!
Bhimavaram: భీమవరంలో తండ్రి ఆస్తిని నకిలీ పత్రాలు, జీపీఏతో కబ్జా చేయడానికి యత్నం; బాధితుడు వెంకట కిరణ్ కుమార్ ఫిర్యాదుతో కోర్టు ఆదేశాలతో ఐదుగురిపై కేసు నమోదు.
Bhimavaram: నకిలీ పత్రాలతో ఆస్తి కబ్జా యత్నం - బాధితుడి ఆవేదన!
Bhimavaram: తమ తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని కొంతమంది వ్యక్తులు నకిలీ పత్రాలతో కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని, ప్రభుత్వం తమను ఆదుకుని న్యాయం చేయాలని బాధితుడు వేలూరి వెంకట కిరణ్ కుమార్ కోరారు.
భీమవరం గునుపూడిలో నివసించే వేలూరి వెంకట సూర్య భాస్కరరావుకు నర్సయ్య అగ్రహారంలో సుమారు 47 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని భాస్కరరావు ముందుగా తన సోదరుడి కుమారుల పేరిట రిజిస్టర్ వీలునామా రాశారు. కాగా, 2024 మార్చి 2న సూర్య భాస్కరరావు మరణించడంతో, ఆయన సోదరుడి కుమారులు ఆ ఆస్తిని భాస్కరరావు నిజమైన కుమారులైన వెంకట కిరణ్ కుమార్, శ్రీనివాస్ ల పేరిట 2024 ఏప్రిల్ 4న రిజిస్ట్రేషన్ చేశారు. బాధితులు కిరణ్ కుమార్, శ్రీనివాస్ లు ఉద్యోగరీత్యా ఒంగోలు, హైదరాబాద్‌లలో నివాసం ఉంటున్నారు.
బాధితులు ఊరిలో లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, 2024 మే నెలలో భీమవరంకు చెందిన దస్తావేజు లేఖరి చింతాడ శ్రీనివాస్, గూడూరు త్రిమూర్తులు మరియు తమ మేనత్తలు కలిసి ఆస్తిని కాజేసేందుకు కుట్ర పన్నినట్లు కిరణ్ కుమార్ ఆరోపించారు. రాజానగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ పత్రాలతో జీపీఏ (GPA) సృష్టించడమే కాకుండా, తమ నాన్న రాసినట్లుగా అన్-రిజిస్టర్డ్ వీలునామాను తయారు చేసి నరసాపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పార్టిషన్ కూడా చేయించారని మండిపడ్డారు.
ఈ కబ్జా యత్నంలో దస్తావేజు లేఖరి చింతాడ శ్రీనివాస్ ప్రధాన భూమిక పోషించారని కిరణ్ కుమార్ విమర్శించారు. "మా స్వంత ఆస్తిని మేము అనుభవించడానికే 40, 60 శాతం వాటా ఇస్తేనే వదులుతామని బేరం పెట్టారు. మా స్థలం మేము అనుభవించడానికి నీకెందుకు డబ్బులు ఇవ్వాలని నిలదీసినప్పటి నుండి, మా మేనత్తలతో కలిసి ఆస్తిని కబ్జా చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు" అని బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నకిలీ పత్రాలు సృష్టించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న చింతాడ శ్రీనివాస్, గూడూరు త్రిమూర్తులు మరియు మేనత్తలపై కోర్టు ద్వారా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గత జులై 17న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసినట్లు కిరణ్ కుమార్ తెలిపారు.
"తన తండ్రి ఆస్తిని నకిలీ జీపీఏ, అన్-రిజిస్టర్డ్ వీలునామా పత్రాలతో కాజేయాలని చూస్తున్నారు. దస్తావేజు లేఖరి శ్రీనివాస్, గూడూరు త్రిమూర్తులు, మా మేనత్తలు కలిసి మమ్మల్ని బెదిరిస్తున్నారని కోర్టు ఆదేశాలతో వన్ టౌన్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రభుత్వం స్పందించి మా భూమిని మాకు దక్కేలా చూసి న్యాయం చేయాలని కోరారు.




