Veerasaram: ఆక్వా రైతుల సంబరాలు.. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం!
Veerasaram: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో ఆక్వా చెరువులకు రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ ఇస్తామన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ఆక్వా రైతులు సంబరాలు జరుపుకున్నారు.
Veerasaram: ఆక్వా రైతుల సంబరాలు.. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం!
Veerasaram: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం సెంటర్‌లో జిల్లా ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆక్వా రైతులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు.
ఆక్వా చెరువులకు రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా అందరికీ ఈ సబ్సిడీ వర్తింపజేయడం, అలాగే గత ప్రభుత్వం నిలిపివేసిన 12,500 కనెక్షన్లకు కూడా విద్యుత్ సబ్సిడీని పునరుద్ధరించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారని రైతులు కొనియాడారు.
ఇదే సమయంలో రొయ్యల ఫీడ్ (మేత) ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని తెలిపిన రైతులు, ప్రభుత్వం ఫీడ్ ధరలను మరింత నియంత్రించి, మరింత తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు తులసీ రాంబాబు, రైతు హరిబాబు వీరవల్లి చంద్ర శేఖర్ ఆక్వా రైతు సంఘం నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




