Tanuku: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: ఏపీయూడబ్ల్యూజే!

Tanuku: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ స్కీమ్ మరియు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తణుకులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తహసీల్దార్ అశోక్ వర్మకు వినతిపత్రం అందజేశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 17 Aug 2026 5:56 PM IST
Tanuku
X

Tanuku: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: ఏపీయూడబ్ల్యూజే!

Tanuku: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు పట్టణంలో సోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జర్నలిస్టు లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ తహసిల్దార్ అశోక్ వర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐజేయూ రాష్ట్ర నాయకుడు బెల్లంకొండ బుచ్చిబాబు, ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకుడు కొడమంచిలి కృష్ణలు మాట్లాడుతూ జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించి,రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌ను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టుల వయసు, సేవలను దృష్టిలో ఉంచుకుని గౌరవప్రదమైన విశ్రాంత జీవితం కోసం ఇతర రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పాత్రికేయ పింఛన్ పథకాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తణుకు ఏరియాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఏపీయూడబ్ల్యూజే స్టిక్కర్లను అందజేసి సభ్యత్వ నమోదు, రెన్యువల్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి తుల భాస్కర్, APUWJ తణుకు ఏరియా ప్రింట్& ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story