Ananthapalli: వర్షాలు కురవాలని దండు గంగణమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకం!
Ananthapalli: ఎలీనో ప్రభావంతో నల్లజర్ల మండలం అనంతపల్లిలో నీటి ఎద్దడి. ఆషాఢ మాసంలో గ్రామదేవత దండు గంగణమ్మకు ప్రత్యేక అభిషేకం, సారె సమర్పించిన గ్రామ పెద్దలు.
Ananthapalli: వర్షాలు కురవాలని దండు గంగణమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకం!
Ananthapalli: తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, అనంతపల్లి ఎలీనో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. పంటలు ఎండిపోతున్నాయి, చెరువులు, కాలువలు నీరులేక వెలవెలబోతున్నాయి. పశువులకు సైతం తాగునీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో గ్రామానికి అధిష్ఠాన దేవత అయిన దండు గంగణమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి సారె సమర్పించారు.
ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ పెద్దలు, భక్తులు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. గ్రామంలో మంచి వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు తాగునీటి సమస్య తొలగిపోవాలని, పశువులకు నీటి కొరత లేకుండా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జమ్ముల సతీష్, బోయపాటి రమేష్, కలం సత్యనారాయణ, బళ్ళ నాని, బంక అప్పారావు, గన్నమని కృష్ణ మోహన్, పోకల నరసింహరావు, కెంగం శ్రీనివాస్, వలిరెడ్డి సతీష్, విప్పిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొని సారె సమర్పించి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు జమ్ముల సతీష్ మరియు బోయపాటి రమేష్ మాట్లాడుతూ, ఎలీనో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు, పశువుల పెంపకందారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామదేవతకు ఆషాఢ మాసంలో సారె సమర్పించి అభిషేకం నిర్వహిస్తే మంచి వర్షాలు కురుస్తాయని పూర్వీకుల నుంచి వస్తున్న విశ్వాసమని చెప్పారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామస్తులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు.
అనంతరం గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని సామూహికంగా ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.




