Achanta: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Achanta: ఆచంట నియోజకవర్గం వల్లూరులో జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు డ్రాయింగ్ బుక్స్ పంపిణీ చేశారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 29 Aug 2026 7:05 PM IST
Achanta
X

Achanta: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఆచంట: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యుటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్బంగా ఆచంట నియోజకవర్గం, వల్లూరు గ్రామం లో ఐదు రోజులు వేడుకల్లో భాగంగా మొదటి రోజు స్కూల్ పిల్లలకు డ్రాయింగ్ బుక్స్ పంపిణి చెయ్యడం జరిగింది.

ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ ఉమ్మడి పగో జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ప్రతీ సంవత్సరం ఆచంట నియోజకవర్గం లో సేవా కార్యక్రమాలతో ఐదు రోజులు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది అని అందులో భాగంగా ఈ రోజులు విద్యార్థులకు వల్లూరు డా బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద డ్రాయింగ్ బుక్స్ పంపిణి చేశామన్నారు.

ఈ కార్యక్రమం లో వల్లూరు జనసేన గ్రామ అధ్యక్షులు కడిమి ఉమా మహేశ్వరస్వామి, జనసేన ఆచంట మండల సెక్రెటరీ లు కాపవరపు రామకృష్ణ, పంపన సాయి, పెచ్చేట్టి శ్రీనివాసరావు, తోట సాయిబాబా, కట్టుంగ వెంకట ముత్యం, ఎల్లమెల్లి ప్రవీణ్, ముల్కి రాజు, మొదలగువారు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story