Penugonda: పెనుగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పితాని

Penugonda: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం దేవ గ్రామంలో రూ.31.60 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీ రహదారి, మినీ గోకులాలను ఘనంగా ప్రారంభించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 22 Jun 2026 9:36 PM IST
Penugonda
X

Penugonda: పెనుగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పితాని

Penugonda: వాసవి పెనుగొండ, గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. పెనుగొండ మండలం, దేవ గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధులతో సుమారు రూ.28 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారిని, అలాగే రూ.3.60 లక్షలతో నిర్మించిన మినీ గోకులాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

రహదారులు, పశుసంవర్థక రంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు వెలిచేటి బాబు రాజేంద్రప్రసాద్, మన్నే శ్రీహరివిశ్వేశ్వర పెండ్లికొడుకు, కండిపోయిన ఏడుకొండలస్వామి, వెలిచేటి రాము, గొల్ల ఏడుకొండలు, నెక్కంటి మోహనరావు తదితర కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story