Achanta: ఆచంటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ!
Achanta: ఆచంట అన్నా క్యాంటీన్ కచేరి సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరు.
Achanta: ఆచంటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ!
ఆచంట: ఆచంటలో అన్నా క్యాంటీన్ వద్ద ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. ఘనంగా నిర్వహించారు.పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండల కేంద్రంలోని కచేరి సెంటర్‌లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఘనంగాఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ... తెలుగుజాతి గర్వించదగ్గ గొప్ప నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లకు ప్రాధాన్యత కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
స్థానిక శాసన సభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ... ఆచంట కచేరి సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంతో ఆచంటలో పండుగ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు.




