Gandi Gurukulam: గండి గురుకులంలో 7వ తరగతి పాపను బాదిన టీచర్!
Gandi Gurukulam: వైఎస్ఆర్ జిల్లా గండి గురుకులంలో సైన్స్ టీచర్ జావిద్ దాడికి 7వ తరగతి విద్యార్థి స్పృహ కోల్పోయాడు. కఠిన చర్యలకు తల్లిదండ్రుల డిమాండ్.
Gandi Gurukulam: గండి గురుకులంలో 7వ తరగతి పాపను బాదిన టీచర్!
గురుకుల పాఠశాలలో దారుణం
7వ తరగతి విద్యార్థిని చావబాదిన సైన్స్ టీచర్
వైఎస్ఆర్ జిల్లా, చక్రాయపేట మండలం, గండి గురుకుల పాఠశాల: ఒక ఉపాధ్యాయుడి దాడి ఓ విద్యార్థి ప్రాణాలతో చెలగాటమాడింది.
ఘటన వివరాలు:
పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి అఖిలానందన్*ను *సైన్స్ టీచర్ జావిద్ విచక్షణారహితంగా చావబాదాడు.
దెబ్బల తీవ్రతకు విద్యార్థి స్పృహ కోల్పోయాడు. అయినా టీచర్ జావిద్ అలాగే వదిలేసి వెళ్లిపోయాడు.
ఏం జరిగింది?
స్పృహ కోల్పోయిన విద్యార్థిని చూసి భయపడిన తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
స్కూల్ సిబ్బంది తీరు:
అనంతరం గురుకుల పాఠశాల సిబ్బంది "తప్పయింది క్షమించండి" అంటూ బాధిత కుటుంబానికి 5,000 నగదు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఘటనతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ జావిద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.




