Mahabubabad: ఫ్రీ బస్సు వద్దమ్మా బస్సులు ఆపండి చాలు మహిళల ధర్నా!
Mahabubabad: ఉచిత బస్సులతో ఎక్స్‌ప్రెస్ ఆపడం లేదని కొత్తపేటలో మహిళల ధర్నా. బస్ స్టాప్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో నిరసన.
Mahabubabad: ఫ్రీ బస్సు వద్దమ్మా బస్సులు ఆపండి చాలు మహిళల ధర్నా!
Mahabubabad: బయ్యారం మండలం కొత్తపేట లో గతంలో మాదిరిగా ఆర్డినరీ సర్వీస్ లతో పాటు ఎక్సప్రెస్ బస్సు లను ఆపాలని మహిళలు ధర్నా. గతంలో ఫ్రీ బస్సు లేనప్పుడు అన్ని బస్సు లకు స్టాప్ ఉందని ఫ్రీ బస్సు వచ్చాక బస్సులు ఆపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు.
ఏజెన్సీ నుండి 30 గ్రామాల ప్రజలు గత సుమారుగా 40 సంవత్సరాల నుండి కొత్తపేట బస్టాండ్ నుండి వివిధ ఊర్లకు వెళ్లేవరని , ఇప్పుడు ఆపకపోవడంతో ఇబ్బంది, బస్సు లు ఆపకపోవడం వలన ప్రైవేట్ వాహనాల్లో వెళుతున్నామని ఆగ్రహం.
మహిళలను చూస్తే ఖాళీగా వున్నా బస్సులు ఆపడం లేదని ఆగ్రహం గతంలో ఆగిన బస్సులు రెండేళ్ల నుండి ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించిన మహిళలు. ఫ్రీ బస్సు లేకపోయినాపర్వాలేదు మా ఊర్లో బస్సులు ఆపాలని మహిళల వేడుకోలు.
ఈ కార్యక్రమంలో మహిళలు, ప్రయాణికులు పాల్గొన్నారు.




