Warangal: పార్టీ మారే ప్రసక్తే లేదు.. కాంగ్రెస్‌లోనే ఉంటా: కొండా సురేఖ

Warangal: పార్టీ మారే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని కొండా సురేఖ స్పష్టం చేశారు. ప్రత్యర్థులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 13 Sept 2026 3:32 PM IST
Warangal
X

Warangal: పార్టీ మారే ప్రసక్తే లేదు.. కాంగ్రెస్‌లోనే ఉంటా: కొండా సురేఖ

Warangal: వరంగల్. మాజీమంత్రి కొండా సురేఖ కామెంట్స్.

పది రోజుల నుండి కార్యకర్తలు ఎంతో బాధపడుతున్నారు. సుమంత్ బెయిల్ కోసం కార్యకర్తలను కలవడం ఆలస్యం అయింది. ఇప్పుడున్న నాయకులు పొద్దున ఒక పార్టీలో పార్టీ మధ్యాహ్నం ఒక పార్టీలో తిరుగుతున్నారు.

తాను ఎప్పుడు పదవుల కోసం ఆరాటపడలేదని. వైయస్సార్ చనిపోయాక ఇక్కడున్న గుంట నక్కలు తమను మోసం చేశారు. కెసిఆర్ సూచనతో వరంగల్ తూర్పులో పోటీ చేసి అప్పటి మంత్రిని 55 వేల మెజారిటీతో ఓడించాను.

పరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి అక్రమంగా సంపాదించాడు. చిన్న తప్పు కానీ చిన్న మచ్చ లేకుండా మూడు శాఖలను సమర్ధవత్తంగా నిర్వహించాను. పదవి అనేది అలంకారం మాత్రమే పని చేయాలనుకుంటే పదవి అక్కర్లేదు.

నన్ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసినందుకు నేను బాధపడటం లేదు. మేము ఏ పార్టీలోకి పోయే ఆలోచన లేదు... కాంగ్రెస్ పార్టీలో పుట్టాము కాంగ్రెస్ పార్టీలో పెరిగాము.

అనివార్య కారణాలవల్ల టిఆర్ఎస్ పార్టీలోకి పోయాము కానీ ఎవరు ఆ పార్టీ నుండి వెళ్లగొట్టలేదు. స్థానిక డివిజన్లో కనీసం కార్పొరేటర్ గెలిపించుకునే స్థాయి కూడా సారయ్యకు లేదు. ఇకనుండి ఎవరైనా తమ మీద మాట్లాడాలనుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.

రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నవీన్ రాజ్ భుజాలపై నుండి 24 మంది కార్పొరేటర్ లను గెలిపించుకుందాం.

తమకు పైనుండి ఫోన్లు వస్తున్నాయి తమను ఎటు వెళ్లదు అని, తాము పార్టీ మారేది లేదని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాను.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తూర్పులో కొండా సురేఖకు మళ్లీ కాంగ్రెస్ టికెట్ వస్తది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మళ్ళీ రాలు మంత్రి అవుతానని సురేఖ అన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.