Mahabubabad: రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి విప్ రామచంద్రు నాయక్!

Mahabubabad: వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ విజ్ఞప్తి. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

A.Rajkumar, Mahabubabad
Published on: 16 Aug 2026 7:50 AM IST
Mahabubabad
X

Mahabubabad: రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి విప్ రామచంద్రు నాయక్!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ స్నేహా శబరీష్ , ఎమ్మెల్యే మురళీ నాయక్ లతో కలిసిలబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ప్రజా ప్రతినిధులు , వ్యవసాయ , నీటి పారుదల శాఖల అధికారులు , ఆత్మ కమిటీ సభ్యుల తో కలిసి

వర్షబావ పరిస్థితుల్లో రైతులకు అందించవలసిన సలహాలు , సూచనలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విప్.మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు సాగుచేయాలని , పంటల మార్పిడి తో పాటు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ,

కూరగాయలు , పప్పు దినుసులు , ఆయిల్‌పామ్ , గొర్రెల పెంపకం , పాడి పరిశ్రమ వంటి వాటిని చేపట్టాలని ,ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత , ప్రతి రైతు వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పాండ్ లు ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల మట్టాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story