Wazeedu: చీకుపల్లి–పెద్దగొల్లగూడెం ఇసుక వాగు రోడ్డును పరిశీలించిన కలెక్టర్
Wazeedu: వాజేడు మండలంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇసుక వాగు డైవర్షన్ రోడ్డును పరిశీలించిన కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. పునరుద్ధరణకు ఆదేశం.
Wazeedu: చీకుపల్లి–పెద్దగొల్లగూడెం ఇసుక వాగు రోడ్డును పరిశీలించిన కలెక్టర్
వాజేడు: బుధవారం వాజేడు మండలం చీకుపల్లి–పెద్దగొల్లగూడెం ఇసుక వాగు డైవర్షన్ రోడ్డు పరిస్థితిని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పరిశీలించి ప్రత్యామ్నాయ రహదారి పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబధిత అధికారులను ఆదేశించారు.
వాజేడు మండలాల పరిధిలో చీకుపల్లి–పెద్దగొల్లగూడెం గ్రామాల మధ్య ఇసుకవాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరద నీరు రావడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు దెబ్బ తినడంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి–163పై వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలపడం జరిగినది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు వరద ప్రవాహం తగ్గిన అనంతరం ప్రత్యామ్నాయ రహదారిని అత్యవసరంగా పునరుద్ధరించి రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
ప్రస్తుత వరద ఉధృతి అధికంగా ఉండటంతో పైపులు దెబ్బతినకుండా డైవర్షన్ రోడ్డుకు ఇరువైపులా కాల్వలు తవ్వి నీటిని మళ్లిస్తున్నట్లు తెలిపారు. వరద ప్రవాహం తగ్గిన వెంటనే రోడ్డును తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ లెనిన్ వత్సల్ టోప్పో, ఏటూరు నాగారం ఏ ఎస్పీ మనన్ భట్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కొండా కృపాకర్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




