Warangal: వర్ధన్నపేటలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ ఆందోళన!
Warangal: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలో క్రికెట్, వాలీబాల్ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు
Warangal: వర్ధన్నపేటలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ ఆందోళన!
Warangal: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపిస్తూ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్‌లోకి వెళ్లిన ఆయన అక్కడ క్రికెట్, వాలీబాల్, షటిల్ వంటి ఆటలు ఆడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
సాగునీరు అందించాల్సిన ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, యువత, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
కాలువల్లో నీరు పారాల్సిన చోట ఆటలు ఆడాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరూరి రమేష్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.




