Warangal: వరంగల్: స్నేహితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యాపారి మృతి!

Warangal: వరంగల్‌లో మద్యం మత్తులో స్నేహితుడు షకీల్ ఇటుక రాయితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అగుల మల్లికార్జున్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 30 July 2026 4:29 PM IST
Warangal
X

Warangal: వరంగల్: స్నేహితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యాపారి మృతి!

వరంగల్ : మద్యం మత్తులో యువకుడిపై దాడి

శనివారం అర్ధ రాత్రి మద్యం మత్తులో స్నేహితుడు జరిపిన దాడిలో గాయాలపాలైన యువకుడు మల్లికార్జున్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఎంజీఎం ఆసుపత్రిలో మరణించాడు.

చింతల్ ఆర్ ఎస్స్ నగర్ ప్రాంతానికి చెందిన అగుల మల్లికార్జున్ వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో పండ్లు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న షకీల్ అతడి స్నేహితుడు. శనివారం తొలి ఏకాదశి సందర్భంగా మల్లికార్జున్, షకీల్ కలిసి స్థానికంగా బెల్టు షాపులో మద్యం సేవించారు. ఇంటికి వెళ్లే క్రమంలో షకీల్, మల్లికార్జున్ మద్యం మత్తులో వాగ్వాదం చేసుకున్నారు. గొడవ పెద్దది కావడంతో పక్కనే ఉన్న ఇటుక రాయితో మల్లికార్జున్ తలపై షకీల్ పదేపదే దాడి చేయడంతో మల్లికార్జున్ కుప్ప కూలిపోయాడు. బాధితుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న మల్లికార్జున్ ఈరోజు ఎంజీఎం ఆస్పత్రిలో మరణించాడు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story