Warangal: కిలా వరంగల్ ఈద్గా వద్ద తవక్కల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

Warangal: మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా కిలా వరంగల్ ఈద్గా ప్రాంగణంలో తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ. జబ్బర్ ఆధ్వర్యంలో 500 మంది పేదలకు అన్నదానం, మిఠాయిలు పంపిణీ చేశారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 26 Aug 2026 8:02 PM IST
Warangal
X

Warangal: కిలా వరంగల్ ఈద్గా వద్ద తవక్కల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

వరంగల్: ఈరోజు కిలా వరంగల్ ఈద్గా ప్రాంగణంలో మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం (మొహమ్మద్ ప్రవక్త) గారి జన్మదిన సందర్భంగా తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎం ఏ. జబ్బర్ గారి ఆధ్వర్యంలో సుమారు 500 మంది పేద ప్రజలకు అన్నదానం కార్యక్రమం మరియు డబల్ క మీఠా అరటి పండ్లను అన్నదానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ సభ్యులు జి డబ్ల్యూ ఎం సి ఎండి చాంద్ పాషా, మీర్జా హసన్ బేగ్, ఎండి. దస్తగీర్, ఎండి. అంకుష్, ఎండి. షర్ఫుద్దీన్, ఎండి. సలీం, ముస్తఫా మరియు ఈద్గా మజీద్ ఇమామోఖతీబ్ నోమన్ రజా తదితరులు పాల్గొన్నారు

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story