Warangal: ఏనుమాముల మార్కెట్ గోదాముల నిర్మాణానికి స్థలాల పరిశీలన

Warangal: వరంగల్ ఏనుమాముల మార్కెట్ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణానికి ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని స్థలాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 29 Aug 2026 6:04 PM IST
Warangal
X

Warangal: ఏనుమాముల మార్కెట్ గోదాముల నిర్మాణానికి స్థలాల పరిశీలన

వరంగల్: వరంగల్ ఏనుమాముల మార్కెట్ ఆధ్వర్యంలో గోదాంల నిర్మాణానికి మార్కెట్ చైర్మన్ ఎర్ర ప్రియాంక గారితో కలిసి స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి 15రోజులలో సర్వే నిర్వహించి భూమి వివరాలతో పాటు పూర్తి స్థాయి లేఅవుట్ మ్యాప్ సిద్ధం చేయాలని అలాగే 5 నుండి 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు రెవెన్యూ మరియు మార్కెట్ అధికారులను ఆదేశించారు.

ధర్మసాగర్ మండలం ముప్పారం మరియు వేలేరు మండలం సోడాషపల్లి లో వరంగల్ ఏనుమాముల మార్కెట్ అధీనంలో ఉన్న స్థలాలను మార్కెట్ చైర్మన్ ఎర్ర ప్రియాంక అనిల్ గారితో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..... ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ పరిధిలో ఎంత భూమి ఉంది, అందులో మాడల్ స్కూల్, ప్రస్తుతం ఉన్న గోదాం నిర్మాణానికి ఎంత భూమి కేటాయించారు ఇంకా ఎంత భూమి అందుబాటులో ఉందొ సర్వే నిర్వహించి సరిహద్దులు నాటి 15రోజులలో పూర్తి స్థాయి లే అవుట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అందుబాటులో ఉన్న భూమిని వినియోగంలోకి తెచ్చే విధంగా అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే వేలేరు మండలం సోడాషపల్లి గ్రామ పరిధిలో ఉన్న మార్కెట్ స్థలంలో సబ్ యార్డు వద్ద వాచ్ మెన్ తో పాటు , జంగిల్ క్లియరెన్స్, విద్యుత్, త్రాగు నీటి సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. 5ఎకరాల స్థలంలో 2కోట్లతో నిర్మించిన సబ్ యార్డ్ ఎందుకు నిరూపయోగంగా ఉందని మార్కెట్ అధికారులను ప్రశ్నించారు.

రైతుల అవసరాలకు మరియు ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఉన్న 5ఎకరాల భూమికి సంబందించి పూర్తి స్థాయి లే అవుట్ మ్యాప్ తో పాటు 5నుండి 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సోడాషపల్లి మార్కెట్ సబ్ యార్డు వినియోగంలోకి తేవడంతో పాటు గోదాం నిర్మాణం చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు వేలేరు మండల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏనుమాముల మార్కెట్ చైర్మన్ ఎర్ర ప్రియాంక అనిల్, వైస్ చైర్మన్ బండి జనార్దన్, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, డైరెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడివోలు, వివిధ గ్రామాల సర్పంచులు, ధర్మసాగర్, వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story