Warangal: మిల్స్ కాలనీలో కానిస్టేబుల్‌పై దాడి హత్యాయత్నం కేసు నమోదుకు డిమాండ్!

Warangal: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో టీజీఎస్పీ కానిస్టేబుల్‌పై దాడి తీవ్ర కలకలం. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 26 Aug 2026 4:53 PM IST
Warangal
X

Warangal: మిల్స్ కాలనీలో కానిస్టేబుల్‌పై దాడి హత్యాయత్నం కేసు నమోదుకు డిమాండ్!

Warangal: మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటనలో డ్యూటీలో ఉన్న బీట్ కానిస్టేబుల్ టీజీఎస్పి కానిస్టేబుల్ పై మొదట చేయి చేసుకోగా టీజీఎస్పీ కానిస్టేబుల్ తను కూడా మళ్లీ చేయి చేసుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే టీజీఎస్పి కానిస్టేబుల్ పైన అదే రోజు కేసు నమోదు చేశారు.

మిల్స్ కాలనీ పోలీసులు. కానీ కానిస్టేబుల్ చేయి చేసుకున్న అనంతరం ఒక పశువును కొట్టినట్టు అక్కడే నడిరోడ్డుపై కొట్టారు బార్ షాప్ కు సంబంధించిన వ్యక్తులు. అక్కడే కాకుండా పారిపోతుంటే దొరకబట్టి మరి విచక్షణ లేకుండా కొట్టిన ఆ ఇద్దరు వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వీడియో చూసిన ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు...!

ఆ ఇద్దరు బార్ షాప్ వ్యక్తులపై తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకుంటారా...! లేదా వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తారో వేచి చూడాలి....!

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story