Warangal: రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ!

Warangal: వరంగల్ జిల్లా రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజా రెడ్డి. వైద్య సేవలు, రికార్డుల పరిశీలన.

Narender, Staff Reporter  -Warangal
Published on: 29 Aug 2026 6:12 PM IST
Warangal
X

Warangal: రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ!

Warangal: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి గారు రాయపర్తి (వర్ధన్నపేట) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ రిపోర్టులు, రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ఫార్మసీ మరియు ల్యాబొరేటరీలను పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు.తదనంతరం పల్లె దవాఖానల వైద్యాధికారులు (MLHPలు) మరియు వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజా రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పల్లె దవాఖానల్లో ఓపీ శాతాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు స్థానికంగానే అవసరమైన వైద్య సేవలు అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

ఫార్మసీలో మందుల నిర్వహణలో First In – First Out (FIFO) విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని, ఎక్స్‌పైరీ తేదీ సమీపంలో ఉన్న మందులను ముందుగా వినియోగించాలని సూచించారు. అన్ని అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా తగిన నిల్వలు నిర్వహించాలని ఆదేశించారు.

ల్యాబొరేటరీలో సేకరించిన రక్త నమూనాలను నిర్దేశిత విధానంలో సక్రమంగా T-Hub Diagnostics కేంద్రానికి పంపించాలని సూచించారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో నిర్దేశించిన కీలక పారామీటర్లలో పురోగతి సాధించాలని అన్నారు.

అలాగే సీజనల్ వ్యాధులు, కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించాలని సూచించారు. టీబీ వ్యాధిగ్రస్తులు, మధుమేహం మరియు రక్తపోటు ఉన్న రోగులకు అవసరమైన మందులు సక్రమంగా అందేలా చూడాలని అన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె దవాఖానలు మరియు AAM కేంద్రాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు మరియు వ్యర్థ మొక్కలను స్వయంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజా రెడ్డి గారు దగ్గరుండి తొలగింపజేసి, పరిసరాల పరిశుభ్రతపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఆర్. రాజమౌళి, స్థానిక వైద్యాధికారి డాక్టర్ అరుణ్ కుమార్, ఎంపీహెచ్‌ఈఓ సదానందం, ఎం ఎల్ ఎచ్ పి లు మరియు ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story