Warangal: రాహుల్‌పై అక్రమ కేసులు వరంగల్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా!

Warangal: రాహుల్ గాంధీపై అక్రమ కేసులను నిరసిస్తూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వెంకట్రామ జంక్షన్ వద్ద భారీ ధర్నా.

MD. AMEER, WARANGAL EAST
Published on: 1 Sept 2026 12:09 PM IST
Warangal
X

Warangal: రాహుల్‌పై అక్రమ కేసులు వరంగల్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా!

Warangal: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపణ. దీనిని నిరసిస్తూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ అనంతరం జరిగిన శుద్ధి యజ్ఞంపై దళితుల హక్కుల కోసం స్పందించిన రాహుల్ గాంధీపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. ఈ కేసును కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ నేతృత్వంలో నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కేందుకు కుట్ర చేస్తోందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్ మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో జంక్షన్ హోరెత్తింది, రాహుల్ పై కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేష్ మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ నల్గొండ రమేష్ చిలువేరు శ్రీనివాస్,14 వ డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్, వినోద్, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story