Warangal: ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

Warangal: దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 7 Sept 2026 10:21 PM IST
Warangal
X

Warangal: ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

వరంగల్: వరంగల్ శాసనమండలి సాక్షిగా దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అంజిత వ్యాఖ్యలు చేసిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ మధు అహంకారాన్ని యావత్ సమాజం ఖండిస్తుందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నారు. శాసనమండలిలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ పోచమ్మ మైదాన్ జంక్షన్ లో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ మధు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

దళిత స్పీకర్ పై అహంకారపూరిక గా వ్యవహరించిన ఎమ్మెల్సీ తాతా మధు ను బేసిరతగా బర్తడే చేయాలని గతంలో బిఆర్ఎస్ అధినేత దళిత ఉపముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసి అవమానించాడని, కరీంనగర్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ను సభా వేదికలో కరచాలని ఇస్తే తోసేసిన ఘనత టిఆర్ఎస్ అధినేతకి దక్కిందని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బట్టి విక్రమార్క శాసనసభ పక్ష నేతగా ఉంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన చరిత్ర బి.ఆర్.ఎస్ నాయకులదని, ఇప్పటివరకు అసెంబ్లీకి రాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి 24 లక్షల రూపాయల జీతాన్ని తీసుకొని సభ హక్కుల్ని ఉల్లంఘించాడని ఇప్పటికైనా దళిత నాయకులు కళ్ళు తెరిచి బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ నిజస్వరూపాన్ని గమనించాలని వరంగల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఆయుబ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ బాసిత్ తాహెర్, బసవరాజ్ శ్రీమాన్, బసవరాజ్ కుమార్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేష్, డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్,నమిడ్ల శ్రీను, కొత్తపల్లి శీను, మడిపల్లి కృష్ణ, కూచన రవి, తోట హరీష్ తదితరులు పాల్గొన్నారు

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story