Warangal: సామాజిక భద్రత పింఛన్ల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ శారద!
Warangal: వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో చేయూత సామాజిక భద్రత పింఛన్ల అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద.
Warangal: సామాజిక భద్రత పింఛన్ల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ శారద!
Warangal: అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత పింఛన్లు అందేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో చేయూత సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆవిష్కరించారు. కొత్తగా పింఛన్లు పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా ప్రజలకు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆమె సూచించారు.
చేయూత సామాజిక భద్రత పింఛన్ల కోసం ఆగస్టు 31, 2026 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన వారు గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2.25 లక్షల మంది అర్హులకు సామాజిక భద్రత పింఛన్లు అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కార్యక్రమంలో డియార్వో విజయలక్ష్మి , డిఆర్డిఓ నాగపద్మజా,అడిషనల్ పిడి శ్రీనివాస్,dpm పెన్షన్ రేవతి తదితరులు పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.




