Warangal: వన మహోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
Warangal: రంగసాయిపేట జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొననున్న వన మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అధికారులు పరిశీలించారు.
Warangal: వన మహోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్: మంగళవారం నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, వరంగల్ ఆర్డీవో సుమ,సంబంధిత అధికారులతో పరిశీలించారు.
రంగసాయిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణాలను సందర్శించిన కలెక్టర్, రేపు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ పాల్గొననున్న వన మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ పరిశీలన లో కూడా సిపిఓ అజిత్ రెడ్డి, డి ఆర్ డి ఓ పి డి నాగ పద్మజ, డిహెచ్ఎస్ఒ శ్రీనివాసరావు, వరంగల్ కిలా వరంగల్ తహసిల్దార్ శ్రీకాంత్ ఇక్బాల్ ఫారెస్ట్ అధికారులు తదితరులు ఈ పరిశీలనలను జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు
Next Story




