Warangal: మట్టేవాడ స్కూల్‌లో కలెక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీ

Warangal: వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మట్టేవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యత మరియు వంటశాల పరిశుభ్రతను పరిశీలించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 24 Aug 2026 8:51 PM IST
Warangal
X

Warangal: మట్టేవాడ స్కూల్‌లో కలెక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీ

వరంగల్: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సోమవారం మట్టేవాడ ప్రభుత్వఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భోజన తయారీ, వడ్డింపు ప్రక్రియలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

విద్యార్థులకు అందుతున్న భోజనం విషయంలో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story