Warangal: జిజ్ఞాస’ ప్రాజెక్ట్ పోటీలకు వరంగల్ సీకేఎం కళాశాల విద్యార్థులు ఎంపిక!
Warangal: హైదరాబాద్ నాంపల్లి రూసా సెంటర్లో జరిగే రాష్ట్రస్థాయి జిజ్ఞాస 2025-26 ప్రాజెక్ట్ పోటీలకు వరంగల్ సీకేఎం కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు.
Warangal: జిజ్ఞాస’ ప్రాజెక్ట్ పోటీలకు వరంగల్ సీకేఎం కళాశాల విద్యార్థులు ఎంపిక!
వరంగల్: వరంగల్ విద్యార్థులలో కేవలం పుస్తక పరిజ్ఞానమే కాకుండా పరిశోధన (రీసెర్చ్), సృజనాత్మకత పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు మూడు రోజుల పాటు నిర్వహించే 'జిజ్ఞాస' 2025-26 రాష్ట్రస్థాయి స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ పోటీలు హైదరాబాదులో ప్రారంభమయ్యాయి.
ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 5200 విద్యార్థుల కు చెందిన 850 ప్రతిభ కనబరిచిన ప్రాజెక్ట్లు ఎంపికై గురువారం హైదారాబాద్ లో గల నాంపల్లి రూసా రీసర్చ్ సెంటర్ లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు వరంగల్ నగరానికి చెందిన సికేఏం కాళాశలల విద్యార్థులుఎంపిక అయ్యారు.
ప్రాజెక్ట్ సూపర్వైజర్ అసోసియేట్ ప్రొఫెసర్ విజయ్ పాల్ రెడ్డి నేతృత్వంలో కార్బన్ ఫూట్ ప్రింట్ ఆఫ్ సీకేఏం కాలేజ్ అనే అంశం పై కూచన మృదుల (బీఎస్సీ కంప్యూటర్ సైన్స్), జె. నందిని (బీఎస్సీ బీజెడ్సీ), బి లక్ష్మీ (బీఎస్సీ బీజెడ్సీ), ఉమాదేవి (బీఎస్సీ బీజెడ్సీ), లు ఎంపిక అయినందున వారిని కాలేజి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోచయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ పి సతీష్, లైబ్రేరియన్ అనిల్, ఆయేషా, వసుధ జ్ఞానేశ్వర్పాషా లతో కూడిన అధ్యాపకుల బృందం శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సీకేఏం కళాశాల నుండి విద్యార్థులు రాష్ట్రం స్థాయికి ఎంపిక కావడం కాలేజీకే కాకుండా వరంగల్ జిల్లాకు ఎంతో గర్వకారణమని ఎంపికైన విద్యార్థులు గురువారం జరగబోయే పోటీల్లో ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో పోటీల్లో ప్రతిభ కనబరచి యావత్ రాష్ట్రంలో మన కాలేజీతో పాటు ఓరుగల్లు సత్తా చాటాలని విద్యార్థులకు సూచించారు.




