Warangal: సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా ప్రకటించాలి ప్రదీప్ రావు!
Warangal: సెప్టెంబర్ 17ను 'తెలంగాణ విమోచన దినోత్సవం'గా అధికారికంగా నిర్వహించాలని వరంగల్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు డిమాండ్.
Warangal: సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా ప్రకటించాలి ప్రదీప్ రావు!
Warangal: సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన, మరుపురాని చారిత్రక ఘట్టమని, నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం అయిన ఈ రోజును “తెలంగాణ విమోచన దినోత్సవం”గా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారి సూచనల మేరకు, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ గంటా రవికుమార్ గారి అధ్యక్షతన వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తా కె. కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ప్రదీప్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం కావడం తెలంగాణ చరిత్రలో కీలక మలుపు అని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దమనకాండకు వ్యతిరేకంగా జాతీయవాదులు, స్వాతంత్ర్య సమరయోధులు, సామాన్య ప్రజలు చేసిన పోరాటాలు, త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
హైదరాబాద్ విమోచన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం రెండింటినీ ఒకే చరిత్రగా చిత్రీకరించడం సరికాదని, వాటికి వేర్వేరు లక్ష్యాలు, రాజకీయ నేపథ్యాలు, కాలపరిమితులు ఉన్నాయని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న నిజాం పాలన ముగిసి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం కాగా, తెలంగాణ సాయుధ పోరాటం ఆ తరువాత కూడా కొనసాగిందని తెలిపారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరించకూడదని, పేర్లు మార్చినంత మాత్రాన చరిత్ర మారదని ప్రదీప్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాల చరిత్రను రాజకీయ రంగులు లేకుండా వాస్తవ ఆధారాలతో నేటి తరానికి తెలియజేయాలని కోరారు.
పరకాల, భైరాన్‌పల్లి వంటి చారిత్రక ఘటనలను పాఠ్యాంశాల్లో చేర్చి యువతకు తెలియజేయాలని, నిజాం, రజాకార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుల త్యాగాలను అధికారికంగా స్మరించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రధాన డిమాండ్లు:
సెప్టెంబర్ 17ను “తెలంగాణ విమోచన దినోత్సవం”గా అధికారికంగా నిర్వహించాలి.
హైదరాబాద్ విమోచన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలను వేర్వేరుగా పాఠ్యాంశాల్లో చేర్చాలి.
పరకాల, భైరాన్‌పల్లి వంటి చారిత్రక ఘటనలను యువతకు తెలియజేయాలి.
విమోచన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వీరులను అధికారికంగా స్మరించాలి.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, సిద్ధం నరేష్, రత్నం సతీష్ షా, జలగం రంజిత్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు గడల కుమార్, కందిమల్ల మహేష్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాబేటి వెంకట్ గౌడ్, జిల్లా కార్యదర్శి పొనుగోటి వెంకట్ రావు, ఐ.టి ఇంచార్జీ ఆడెపు వెంకటేష్, మీడియా కన్వీనర్ అంకాల జనార్ధన్, బిజెపి నాయకులు బైరి మురళీకృష్ణ, కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకల రఘునారెడ్డి, బైరి శ్యాంసుందర్, బండి సాంబయ్య యాదవ్, సంగని జగదీశ్వర్, అంబాల రాంగోపాల్, గోగీకర్ అనిల్, జిల్లా మోర్చా అధ్యక్షులు టెకుమట్ల రేణుక, మదాసు రాజు, కూచన క్రాంతి కుమార్, విట్ఠల్ దాసు బోరహ, మహమ్మద్ రఫీ, రేపల్లె స్వర్ణజ, కొమకుల నాగరాజు, సుంకరి రాజు గార్లు పాల్గొన్నారు.




