Jangaon: 24 గంటలుగా అంధకారంలో మంచుప్పుల కరెంట్ కోతలపై రైతుల నిరసన!

Jangaon: పాలకుర్తి మండలం మంచుప్పులలో 24 గంటలుగా కరెంట్ లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు, గ్రామస్థులు చెన్నూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 14 Aug 2026 12:28 PM IST
Jangaon
X

Jangaon: 24 గంటలుగా అంధకారంలో మంచుప్పుల కరెంట్ కోతలపై రైతుల నిరసన!

Jangaon: ​జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పుల లొ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచుప్పుల గ్రామంలో గత 24 గంటలుగా కరెంట్ లేక ఊరంతా అంధకారంలో అల్లాడిపోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయని గ్రామస్థులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా చెన్నూరు సబ్ స్టేషన్ ను రైతులు, ప్రజలు ముట్టడించారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గత 24 గంటలుగా విద్యుత్ నిలిచిపోవడంతో గ్రామం అంధకారంలోకి వెళ్లిపోయింది.

కాంగ్రెస్ హయాంలో మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయని, నిరంతరం కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరెంట్ కోతలను నిరసిస్తూ మంచుప్పుల గ్రామస్థులు, రైతులు ఏకమై చెన్నూరు విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.

సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story