Venkatapur: వెంకటాపుర్‌లో విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు

Venkatapur: ఆగస్టు 12న వెంకటాపుర్ సబ్ స్టేషన్‌లో విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు. సద్వినియోగం చేసుకోవాలని ములుగు డివిజనల్ ఇంజనీర్ కన్న రాజు పిలుపు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 11 Aug 2026 9:35 PM IST
Venkatapur
X

Venkatapur: వెంకటాపుర్‌లో విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు

వెంకటాపుర్: CGRF-I, CHAIRPERSON (FAC), G. NAGAPRASAD Dt:12.08.2026 న వెంకటాపూర్ లోని 33/11 KV వెంకటాపుర్ సబ్ స్టేషన్ కార్యాలయ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు ఏర్పరిచినట్లు TGNPDCL విద్యుత్ వినియోగదారుల ఫోరం ఛైర్‌పర్సన్ తేలిపారు.

ఈ లోకల్ కోర్టులో విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ మార్పు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెంపుదల, లోపాలు ఉన్న మీటర్లు మార్చడం, నూతన సర్వీసులు మంజూరు, అదనపు లోడ్ క్రమబద్ధీకరణ, సర్వీసు పేరు మార్పు, వాడకానికి హెచ్చు మొత్తంలో గల బిల్లులు, కేటగిరీ మార్పు, సర్వీస్ రద్దు మొదలగు వాటికి సంబంధించి విద్యుత్ వినియోగదారులు వార్తపూర్వకంగా తమ ఫిర్యాదులు అందించవచ్చునని తెలిపారు.

ఈ ఫిర్యాదులు ఉదయం గం. 10.30 నుండి మధ్యాహ్నం గం. 1.00 వరకు స్వీకరించబడునని అన్నారు. కావున మల్లంపల్లి,ములుగు, వెంకటాపుర్, పసర మరియు తాడ్వాయి సెక్షన్ పరిధి లోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ములుగు డివిజనల్ ఇంజనీర్ కన్న రాజు గారు ఒక ప్రకటన లో తెలిపారు

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story