Hanumakonda: పరకాల ఆలయంలో వైభవంగా శ్రావణ వరలక్ష్మీ వ్రతం!
Hanumakonda: పరకాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ వరలక్ష్మీ వ్రతం. భక్తిశ్రద్ధలతో పాల్గొని తాంబూలాలు, వాయనాలు ఇచ్చిపుచ్చుకున్న మహిళలు.
Hanumakonda: పరకాల ఆలయంలో వైభవంగా శ్రావణ వరలక్ష్మీ వ్రతం!
Hanumakonda: పరకాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో మహిళలు జరుపుకున్నారు.
శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో వరలక్ష్మి వ్రతం ఒకటి . అష్టలక్ష్ములకు ప్రతీక అయిన వరలక్ష్మీదేవిని లక్ష పువ్వులు పసుపు కుంకుమలతో పూజించడం ద్వారా కుటుంబంలో సుఖశాంతులు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం . పూజ ముగిసిన తర్వాత ముత్తైదువులను సుమంగళి లను పిలిచి తాంబూలాలతో పసుపు కుంకుమ నానబెట్టిన శనగలు గాజులు పండ్లు బ్లౌజ్ పీస్ కలిసి వాయనం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటారు.
దీర్ఘాయుష్షు కోసం మరియు ఇంటి సౌభాగ్యం కోసం వ్రతం ఆచరిస్తారు. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ఈ శ్రావణ శుక్రవారం జరుపుకోవడం జరుగుతుంది.




