Lakkavaram: లక్కవరంలో ఘోర రోడ్డు ప్రమాదం - అన్నదమ్ములు మృతి!

Lakkavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లక్కవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు దుర్మరణం చెందగా, ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.

PRABHU, RAZOLE
Published on: 4 Sept 2026 9:51 AM IST
Lakkavaram
X

Lakkavaram: లక్కవరంలో ఘోర రోడ్డు ప్రమాదం - అన్నదమ్ములు మృతి!

Lakkavaram: బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, లక్కవరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల వివరాల ప్రకారం.. భీమవరంలో జరిగిన పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో లక్కవరం వద్ద కారు అదుపుతప్పి కొబ్బరి చెట్లను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో లక్కవరం గ్రామానికి చెందిన ముదునూరి రాంబాబురాజు (60), ముదునూరి శ్రీనురాజు (58) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అత్యవసర చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై మలికిపురం ఎస్‌ఐ ఎం. మోహన్ కుమార్ విచారణ చేపట్టారు. అన్నదమ్ములు మృతి చెందడంతో లక్కవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story