Mulugu: పంటల వివరాల నమోదు పక్కాగా ఉండాలి: CPO జవహర్ లాల్!

Mulugu: ములుగు రైతు వేదికలో ఎంపీఎస్‌వోలు, ఏఈవోలకు డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వేపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర శిక్షణ నిర్వహించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 27 Aug 2026 4:39 PM IST
Mulugu
X

Mulugu: పంటల వివరాల నమోదు పక్కాగా ఉండాలి: CPO జవహర్ లాల్!

ములుగు: డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (Digital General Crop Estimation Survey)*పై ములుగులో MPSOలు, AEOలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ములుగు రైతు వేదికలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా DySO శ్రీ U. లక్ష్మీనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే నిర్వహణపై సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో పంటల సాగు పరిస్థితులను పరిశీలించడం, వివిధ పంటల సాగు విస్తీర్ణాన్ని ఖచ్చితంగా గుర్తించడం, పంటల వివరాలను సేకరించడం, దిగుబడి అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడం, సర్వేలో ఉపయోగించే డిజిటల్ విధానాన్ని సమర్థవంతంగా వినియోగించడం వంటి అంశాలను వివరించారు.

సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో సేకరించే ప్రతి వివరాన్ని సమయపాలనతో, పారదర్శకంగా, ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా డిజిటల్ విధానంలో నమోదు చేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. పంటల రకం, సాగు విస్తీర్ణం, పంట పరిస్థితి, దిగుబడి అంచనాలకు సంబంధించిన వివరాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నమోదు చేయాలని సూచించారు. డేటా నమోదు సమయంలో మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ, అనుమానాలు లేదా సాంకేతిక సమస్యలు ఎదురైతే సంబంధిత ఉన్నతాధికారుల సూచనలు తీసుకోవాలని తెలిపారు.

ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీ భానోతు జవహర్ లాల్ మాట్లాడుతూ, వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలకు నమ్మకమైన వ్యవసాయ గణాంకాలు ఎంతో కీలకమని అన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించే సమాచారం ఎంత ఖచ్చితంగా ఉంటే, జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రణాళికలు మరియు విధానాల రూపకల్పన అంత సమర్థవంతంగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని మరియు ఫారం-1 & ఫారం-2 నిర్ణత సమయం లో ఆన్ లైన్ నమోదు చేయాలి ల్యాప్స్ కాకుండా చూడాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో,SO శ్రీ భూక్య లాల్ నాయక్, DySOలు శ్రీ ప్రదీప్ కుమార్, శ్రీ జి. శ్రీనివాస్, MPSOలు, AEOలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story