Jangaon: ఝాన్సీరాజేందర్ రెడ్డి దంపతులకువివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

Jangaon: దేవరుప్పులలో ఝాన్సీ-రాజేందర్ రెడ్డి వివాహ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేసి కాంగ్రెస్ శ్రేణులు అభినందించాయి.

S MAHENDER, PALAKURTHI
Published on: 8 Aug 2026 12:48 PM IST
Jangaon
X

Jangaon: ఝాన్సీరాజేందర్ రెడ్డి దంపతులకువివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

జనగామ జిల్లా

దేవరుప్పుల మండలం

ఘనంగా ఝాన్సీ రెడ్డి – రాజేందర్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

దేవరుప్పుల: టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు మరియు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేందర్ రెడ్డి గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దావెర అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకొని ఝాన్సీ రెడ్డి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీతారాంపురం గ్రామంలోని ప్రేమ సదనం అనాథ వృద్ధాశ్రమాన్ని సందర్శించి, అక్కడి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా దావెర అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఝాన్సీ రెడ్డి గారు, డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు ప్రజా సేవకు అంకితమైన వ్యక్తులని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు.

టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని దావెర అనిల్ కుమార్ పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, మహిళలు, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆమె చేస్తున్న కృషి అభినందనీయమన్నా*రు.

అలాగే ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు వైద్య రంగంలో అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని దావెర అనిల్ కుమార్ అన్నారు. ఇప్పటివరకు సుమారు 30 వేల గుండె ఆపరేషన్లు నిర్వహించి, ఎంతోమంది గుండె రోగుల ప్రాణాలను కాపాడి, వేలాది కుటుంబాల్లో ఆనందాన్ని నింపారని కొనియాడారు. వైద్య వృత్తిని కేవలం వృత్తిగా కాకుండా మానవ సేవగా భావిస్తూ, ఆపదలో ఉన్న ఎంతోమందికి వైద్య సేవలు అందించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.

ఒకవైపు ప్రజా సేవలో ఝాన్సీ రెడ్డి గారు, మరోవైపు వైద్య సేవల ద్వారా డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు చేస్తున్న సేవలు అభినందనీయమని, వారి సేవా దృక్పథం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని దావెర అనిల్ కుమార్ పేర్కొన్నారు.

వివాహ బంధంతో ఒక్కటై, ప్రజా సేవను తమ జీవితంలో భాగంగా చేసుకొని ముందుకు సాగుతున్న ఝాన్సీ రెడ్డి – డాక్టర్ రాజేందర్ రెడ్డి దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలని ఈ సందర్భంగా దావెర అనిల్ కుమార్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story