Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా టీడీపీ మహానాడు వేడుకలు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీడీపీ మహానాడు-2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 27 May 2026 6:22 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా టీడీపీ మహానాడు వేడుకలు!

Mahabubabad: టీడీపీ మహానాడు ను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని పద్మ శాలి కమ్యూనిటీ భవన్ లో టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి కొండపల్లి రాంచందర్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించి టీడీపీ వ్యవస్థపాకులు మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలాల తో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ పార్టీ నిర్వహిస్తున్న మహానాడు 2026 వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి లో నిర్వహించే వేడుకలను వర్చువల్ గా టీడీపీ శ్రేణులు వీక్షించారు.

ఈ సందర్బంగా టీడీపీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కొండపల్లి రాంచందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా టిడిపి చేసిన సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తాయ , తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఎక్కడుందన్న వారికి మహబూబాబాద్ లో జరుగుతున్న మహానాడు వేడుకలే నిదర్శనమని, ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు సారధ్యంలో 2028 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ లో కూటమి తరపున అభ్యర్థులు పోటీ చేసీ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ తెలంగాణాలో ఉండడం చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ పొదుపు చర్యల్లో భాగంగా తొలిసారిగా మహానాడు వేడుకలను వర్చువల్ గా నిర్వహించడం జరిగిందన్నారు. సాంకేతికతను వినియోగించుకొని భారీ ఖర్చులకు బదులు, డిజిటల్ మాధ్యమాల ద్వారా పార్టీ శ్రేణులు తిలకించడం ఈ మహానాడు ప్రత్యేకత అన్నారు. ఈ నెల 28 న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story