Bhupalpally: భూపాలపల్లిలో సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి ఘన నివాళి!

Bhupalpally: భూపాలపల్లి కొమురయ్య భవన్‌లో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి. ఆయన ఆశయ సాధనకు సిపిఐ పిలుపు.

RAJU, BHUPALAPALLI
Published on: 22 Aug 2026 2:07 PM IST
Bhupalpally
X

Bhupalpally: భూపాలపల్లిలో సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి ఘన నివాళి!

Bhupalpally: సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ నల్గొండ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని సిపిఐ ఆధ్వర్యంలో కొమురయ్య భవన్‌లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ రెడ్డి జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు, సిపిఐ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వేముల శ్రీకాంత్, యాదగిరి, పీక రవికాంత్, జనార్ధన్, జంపాల పవన్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

RAJU, BHUPALAPALLI

RAJU, BHUPALAPALLI

Next Story