Jangaon: కాంగ్రెస్ గూటికి ఆర్‌ఆర్ బంగ్లా సర్పంచ్ సునీత

Jangaon: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆర్‌ఆర్ బంగ్లా సర్పంచ్ సునీత కనకరాజు. పార్టీలో చేరడంపై హర్షం వ్యక్తం చేసిన నేతలు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 19 July 2026 6:19 PM IST
Jangaon
X

Jangaon: కాంగ్రెస్ గూటికి ఆర్‌ఆర్ బంగ్లా సర్పంచ్ సునీత

జనగామ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు మరియు గౌరవనీయులు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఆర్‌ఆర్ బంగ్లా గ్రామ సర్పంచ్ శ్రీమతి సునీత కనకరాజు ఈరోజు ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లాకావత్ ధన్వంతి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు కోల రవి గౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story