Station Ghanpur: అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ: ఎమ్మెల్యే కడియం!

Station Ghanpur: రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 28 Aug 2026 5:24 PM IST
Station Ghanpur
X

Station Ghanpur: అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ: ఎమ్మెల్యే కడియం!

Station Ghanpur: పవిత్రమైన రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) పండుగను పురస్కరించుకుని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో రాఖీ పండుగకు అత్యంత విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు, రక్షణ బంధానికి ఈ పండుగ ప్రతీక అని అన్నారు. ఒకే తల్లి కడుపున పుట్టినా, పుట్టకపోయినా కులమతాలకు అతీతంగా రక్షణ దారాన్ని (రాఖీ) కట్టి సోదర భావాన్ని చాటుకునే గొప్ప పండుగ రక్షా బంధన్ అని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు. ​మహిళల సంక్షేమం, భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతీ సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదనే అమలు చేస్తుందని గుర్తు చేశారు.

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, మహిళలు ఆర్థికంగా బలపడేందుకు అనేక పథకాలు, సబ్సిడీ రుణాలు, ఉపాధి అవకాశాలు అందిస్తుందని వెల్లడించారు. నియోజకవర్గంలోని అక్కాచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థించారు. ఈ రాఖీ పౌర్ణమి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సోదరభావాన్ని మరింత పెంపొందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఆకాంక్షించారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story