Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం!
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు పెద్దగుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి.. 20 ఏళ్ల తర్వాత కలలో దేవుడు వచ్చి చెప్పడంతో మళ్లీ పూజలు ప్రారంభం.
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం!
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లి, బోల్లేపల్లి, రాజనపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న పెద్దగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి కోలువై ఉన్నడాని. సుమారు 50 సంవత్సరాల క్రితం నాయకపల్లి శివారులోని పెద్దగుట్టపై స్వామివారి పాద ముద్రలు ప్రత్యక్షమవడంతో ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది.
చరిత్ర - స్థల పురాణం:
స్థానికుల కథనం ప్రకారం... ఐదు దశాబ్దాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి తన పాదంతో తన్నడంతో పెద్దగుట్ట పైనుంచి భారీ రాళ్లు కింద పడ్డాయి. ఆ శబ్దాలకు ఆశ్చర్యపోయిన గ్రామస్థులు గుట్టపైకి వెళ్లి చూడగా, అక్కడ స్వామివారి దివ్య పాదాలు కంటపడ్డాయి. నాటి నుంచి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం ఇక్కడ పూజలు, ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేవారు.
కలలో ప్రత్యక్షమైన స్వామివారు
గత 20 ఏళ్లుగా కొన్ని కారణాల వల్ల ఇక్కడ పూజలు నిలిచిపోయాయి. అయితే, ఇటీవల స్వామివారు గ్రామీణుల కలలో కనిపించి, గుట్టపై మళ్లీ పూజా కార్యక్రమాలు ప్రారంభించాలని ఆజ్ఞాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. స్వామివారి ఆదేశంతో పులకరించిపోయిన ఊరి ప్రజలు, భక్తులు వెంటనే గుట్ట వద్దకు చేరుకుని మళ్లీ ధూపదీప నైవేద్యాలను పునఃప్రారంభించారు.
బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వేడుకోలు
ప్రస్తుతం గుట్టపై స్వామివారి పాదాలతో పాటు, ఆనవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తుండటంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్న ఈ క్షేత్రంలో త్వరలోనే అధికారికంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని, ఆలయ అభివృద్ధికి అధికారులు, దేవాదాయ శాఖ సహకరించాలని నాయకపల్లి, బోల్లేపల్లి, రాజనపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.




