Sircilla: చేనేత కళాకారుడి అద్భుత ప్రయోగం తెలుగు అక్షరాలతో పట్టుచీర!

Sircilla: సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల జగదీశ్ వినూత్న ప్రయోగం. తెలుగు అక్షరాల రూపకల్పనతో పట్టుచీరను నేసి వార్తల్లో నిలిచారు.

KALEEM, SIRICILLA
Published on: 29 Aug 2026 9:08 AM IST
Sircilla
X

Sircilla: చేనేత కళాకారుడి అద్భుత ప్రయోగం తెలుగు అక్షరాలతో పట్టుచీర!

Sircilla: సంప్రదాయ చేనేత కళకు ఆధునిక ఆలోచనను జోడిస్తూ సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల జగదీశ్ వినూత్న ప్రయోగం చేశారు. తెలుగు అక్షరాలతో అందమైన పట్టుచీరను నేసి ప్రత్యేకత చాటుకున్నారు.

చీరపై సాధారణంగా పువ్వులు, నెమళ్లు, ఇతర ఆకర్షణీయమైన డిజైన్లు కనిపిస్తుంటాయి. అయితే అందుకు భిన్నంగా తెలుగు భాషలోని అక్షరాలను చీరపై పొందుపరిచారు. సుమారు 650 గ్రాముల బరువున్న ఈ చీరను నేయడానికి 15 రోజుల పాటు శ్రమించినట్లు జగదీశ్ తెలిపారు.

చేనేత మగ్గంపై తెలుగు అక్షరాలను కళాత్మకంగా పొందుపరిచి రూపొందించిన ఈ చీర పలువురిని ఆకట్టుకుంటోంది. చేనేత రంగంలో వినూత్న ప్రయోగాలకు ప్రాధాన్యం ఇస్తూ, తెలుగు భాషపై అభిమానాన్ని చీర రూపంలో చాటడం సంతోషంగా ఉందని జగదీశ్ పేర్కొన్నారు.

సిరిసిల్ల చేనేత కళకు మరింత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రయోగాలు కొనసాగిస్తానని ఆయన తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story