Bhupalpally: మల్లికార్జున్ ఖర్గేపై బీజేపీ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సత్యనారాయణ ఆగ్రహం

Bhupalpally: ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై బీజేపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ సెంటర్‌లో ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసన జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Aug 2026 9:39 AM IST
Bhupalpally
X

Bhupalpally: మల్లికార్జున్ ఖర్గేపై బీజేపీ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సత్యనారాయణ ఆగ్రహం

Bhupalpally: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పట్ల బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తీవ్రంగా ఖండించారు. కుల, మతాల పేరుతో రాజకీయాలు చేయడం బీజేపీకి తగదని అన్నారు. భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో కర్గేకు సంఘీభావంగా నిర్వహించిన సత్యాగ్రహ నిరసన కార్యక్రమంలో, జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణ కోల్పోతున్నామని గ్రహించిన బీజేపీ కుల, మతాలను రాజకీయాల్లోకి తీసుకొస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణ కోల్పోతున్నామని గ్రహించిన బీజేపీ కుల, మతాలను రాజకీయాల్లోకి తీసుకొస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ హిందువులకు మాత్రమే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు సహా అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అండగా ఉంటుందని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగడమే కాంగ్రెస్ విధానమన్నారు.

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వంటి సీనియర్ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకుల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత స్థాయికి దిగజారి మాట్లాడటం ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధమన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story