Jangaon: దేవరుప్పులలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ!

Jangaon: దేవరుప్పుల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ప్రభుత్వ యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఉపాధ్యాయులతో కలిసి కిట్లను అందజేశారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 12 Aug 2026 1:35 PM IST
Jangaon
X

Jangaon: దేవరుప్పులలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ!

Jangaon: దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద,మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలిచేందుకు,వారిలో సమానత్వ భావాన్ని పెంపొందించేందుకు గ్రామ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను పంపిణీ కార్యక్రమాలను చేపడుతున్నారు.

తెలంగాణ విద్యాశాఖ ప్రణాళికల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు కొత్త డిజైన్, కార్పొరేట్ లుక్‌తో కూడిన యూనిఫాం కిట్లను (రెండు జతల బట్టలు,షూస్,సాక్స్, బెల్ట్, టై) అందించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికీ ఈ నాణ్యమైన యూనిఫాంలు చేరాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అందులో భాగంగానే దేవరుప్పుల మండలకేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్ధులకు యూనిఫామ్ లను పంపిణీ చేసిన దేవరుప్పుల గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాగి స్వప్న,ఉపాధ్యాయులు వేల్పుల చంద్రశేఖర్,ధరావత్ వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story