Mahabubabad : గార్లలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు!
Mahabubabad : మహబూబాబాద్ జిల్లా గార్ల నెహ్రూ సెంటర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు. పలువురు ప్రముఖులకు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం.
Mahabubabad : గార్లలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు!
Mahabubabad : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని నెహ్రూ సెంటర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న376వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు.
గౌడ సంఘ నాయకులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు. పోరాట యోధుడిగా పాపన్న త్యాగాలను గుర్తుచేసుకుని ఆయన ఆశయాలను కొనసాగించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పలువురిని ఘనంగా సన్మానించారుగౌడ కుల సంఘం తరఫున గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన తాళ్లపెల్లి కృష్ణ గౌడ్ శాలువాతో సత్కరించారు.
వరుసగా మూడుసార్లు వార్డు నెంబర్‌గా గెలిచిన గౌడ కుల సంఘ నాయకులు తోడేటి శ్రీనివాస్ సన్మానించారు.విదేశీయానం చేసి స్వదేశానికి తిరిగి వచ్చిన విజయ రాముడు గౌడ్ ఘనంగా సత్కరించారు.సమాజ సేవలో తనదైన ముద్ర వేస్తున్న కందునూరి శ్రీనివాస్ అభినందించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అత్తిరాం నాయక్, తోడేటి నాగరాజు, మండ రవి, కత్తి వెంకన్న, మోత్కూరి వెంకటరాజ్యం, కోళ కుమార్ గౌడ్, కొత్తకోట కుమార్, పండు నాగేశ్వరరావు, మోత్కూరి రమేష్, గాజుల కృష్ణ, గాజుల ఐలయ్య, మోత్కూరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు....




