Narsampet: నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడి బలి.. బీఆర్ఎస్ గర్జన
Narsampet: నర్సంపేట ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో రఘునాథపల్లి వద్ద సబితా ఇంద్రారెడ్డి, వినోద్ కుమార్ అరెస్ట్.
Narsampet: నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడి బలి.. బీఆర్ఎస్ గర్జన
Narsampet: నర్సంపేట డిపో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన శంకర్ గౌడ్ మృత దేహాన్ని నర్సంపేటకు వెళుతున్న బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాలోతు కవిత నాయక్ రఘునాథపల్లిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.
రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు. రఘునాథపల్లి పోలీసు స్టేషన్ ముందు బైఠాయించిన బిఆర్ఎస్ కార్యకర్తలు. మా నాయకులను వెంటనే విడుదల చేయాలి శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వ హత్య..
ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న నాయకులపై పోలీస్ అణచివేత నశించాలి అంటూ నినాదాలు.. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, వారి మరణానికి కారణమైంది అని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి వారి అపాయింట్మెంట్ డేటును ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




