Rayaparthy: సీఐ కొమ్మూరి శ్రీనివాస్‌కు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు
Rayaparthy: రాయపర్తిలో సీఐ కొమ్మూరి శ్రీనివాస్‌కు పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో ఆయన సేవలను కొనియాడుతూ శాలువాతో సత్కరించారు.
Rayaparthy: సీఐ కొమ్మూరి శ్రీనివాస్‌కు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు
రాయపర్తి: విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి పోలీసు శాఖలో తనదైన ముద్ర వేసుకున్న వర్ధన్నపేట సీఐ కొమ్మూరి శ్రీనివాస్ బదిలీపై సీసీబీ వరంగల్ వెళ్తున్న సందర్భంగా రాయపర్తి పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా బదిలీ అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ తన సిబ్బంది తో కలిసి సీఐ శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావాన్ని, సిబ్బందితో సమన్వయంతో పనిచేసిన తీరును పోలీసులు కొనియాడారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయడంతో పాటు, పోలీసు సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించారని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
బదిలీపై నూతన బాధ్యతలు స్వీకరించనున్న సీఐ కొమ్మూరి శ్రీనివాస్‌కు రాయపర్తి పోలీసులు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాయపర్తి పోలీస్ సిబ్బంది పాల్గొని సీఐ శ్రీనివాస్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.




