Rayaparthi: రాయపర్తి ఎస్సారెస్పీ నీరు విడుదల చేయాలని ధర్నా
Rayaparthi: ఎల్నినో ప్రభావంతో ఎండిపోతున్న పంటలు. ఎస్సారెస్పీ కెనాల్ లో నీటి విడుదల, 24 గంటల కరెంటు కోసం మైలారంలో రైతుల నిరసన. పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు.
Rayaparthi: రాయపర్తి ఎస్సారెస్పీ నీరు విడుదల చేయాలని ధర్నా
రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పరిధిలోని మైలారం గ్రామంలో జాతీయ రహదారి 563 ఎస్ఆర్ఎస్సి కెనాల్ లోకి వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులకు నిరంతర నాణ్యమైన 24 గంటల కరెంటు ఇచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడాలని రైతులతో కలిసి బిఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందిందని ఇప్పుడు కనీసం ఐదు ఆరు గంటల కరెంటు కూడా రావటం లేదని వాపోయారు.
ఎల్నినో ప్రభావం కారణంగా ఇంతవరకు వర్షాలే సరిగా పడలేదని వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని కావున వెంటనే ఎస్సారెస్పీ కెనాల్ లో నీటిని విడుదల చేసి గ్రామాలలోని చెరువులు నింపి రైతులకు వ్యవసాయ నీటిని అందించాలని రైతులు సబ్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు.
Next Story




