Hanumakonda: బీజేపీ నేత రావు పద్మారెడ్డి హౌస్ అరెస్ట్ కాంగ్రెస్‌పై ఆగ్రహం!
Hanumakonda: ఛలో హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో హనుమకొండలో బీజేపీ నేత రావు పద్మారెడ్డి అక్రమ హౌస్ అరెస్ట్. కాంగ్రెస్ నిరంకుశత్వానికి భయపడేదే లేదని స్పష్టీకరణ.
Hanumakonda: బీజేపీ నేత రావు పద్మారెడ్డి హౌస్ అరెస్ట్ కాంగ్రెస్‌పై ఆగ్రహం!
Hanumakonda: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని, అక్రమ హౌస్ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారి పిలుపు మేరకు తలపెట్టిన "ఛలో హైదరాబాద్" కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి, ఈరోజు ఉదయం హనుమకొండ హంటర్ రోడ్డులోని నా స్వగృహంలో పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యానికి, అహంకారానికి పరాకాష్ట అని బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంటెస్టెడ్ కాండిడేట్ శ్రీమతి రావు పద్మ రెడ్డి గారు అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ "1975లో ఇందిరా గాంధీ విధించిన దేశవ్యాప్త ఎమర్జెన్సీ పైనే వీరోచితంగా పోరాడిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. అట్లాంటిది రేవంత్ రెడ్డి బెదిరింపులకు, అరెస్టులకు బీజేపీ భయపడే ప్రసక్తే లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అణచివేతకు దిగితే, మా పోరాటం అంత తీవ్రమవుతుంది అని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు" అని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ఎవరూ హరించలేరు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం నేరుగా ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని, పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం మానుకోవాలి అని హితవు పలికారు.
అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసిన బీజేపీ నాయకుల వద్ద నుండి పోలీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి, అరెస్టయిన వారిని విడుదల చేయాలి. నిరంకుశ చర్యలకు పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తన పోరాటాన్ని ఉధృతం చేస్తుందని రావు పద్మ రెడ్డి హెచ్చరించారు.




