Jangaon: ఖిలాషాపురం పీఎం శ్రీ పాఠశాలలో బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ప్రారంభం
Jangaon: రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం పీఎం శ్రీ పాఠశాలలో హెచ్ఎం డాక్టర్ భారత రవీందర్ ఆధ్వర్యంలో బాలికలకు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ ప్రారంభమైంది.
Jangaon: ఖిలాషాపురం పీఎం శ్రీ పాఠశాలలో బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ప్రారంభం
Jangaon: రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో హెడ్‌మాస్టర్ డాక్టర్ భారత రవీందర్ ఆధ్వర్యంలో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జీసీడీవో గౌసియా బేగం పర్యవేక్షణలో విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ మాస్టర్ ఓరుగంటి సంతోష్ కుమార్ శిక్షణ అందిస్తున్నారు.
బాలికల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంపొందించడంతో పాటు ఆపద సమయంలో తమను తాము రక్షించుకునే నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ గోనెల సోమన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story




